Arundhati Roy : ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ప్రజాస్యామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఆమె కరణ్ థాపర్ తో వివిధ అంశాలపై స్పందించారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు మోదీ గ్రాఫ్ తగ్గి పోతోందన్నారు. ప్రతి చోటా తమకు ఎదురే లేదన్న భావన పెరుగుతోందని ఇది అత్యంత ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం భారత రాజకీయాలలో ఫాసిజం పోకడ నిబిడీకృతమై పోయిందని స్పష్టం చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక సంపన్నులు పెరిగారు. కానీ అదే సమయంలో పేదలు, ఇతర వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగిన దాఖలాలు లేవు.
ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యాపారవేత్త అదానీ 88 బిలియన్ డాలర్లు, అంబానీ సంపద 87 బిలియన్ డాలర్లు. రాను రాను వారి సంపద పెరుగుతూనే ఉంది.
కానీ ఈ దేశం కోసం ఒక్కటన్నా ఉపయోగకరమైన పని ఏదైనా చేశారా అని అరుంధతీ రాయ్(Arundhati Roy) ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ స్థూల జాతీయోత్పత్తి కేవలం 100 మంది చేతుల్లో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది దేశానికి, ప్రధానంగా ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
గుజరాత్ నడి వీధుల్లో ముస్లింల ఊచ కోత అయ్యాక మోదీ భారత భావి ప్రధాని అంటూ భారతీయ వ్యాపారవేత్తలు ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు అరుంధతీ రాయ్. దేశాన్ని నలుగురు నడుపుతున్నారు.
వారిలో ఇద్దరు అమ్మేస్తుంటే మరో ఇద్దరు కొనేస్తున్నారు. వారు నలుగురు గుజరాత్ కు చెందిన వారంటూ యూపీకి చెందిన ఓ రైతు చెప్పాడంటూ గుర్తు చేశారు. పార్లమెంట్ మన్ కీ బాత్ లాగా మారి పోయిందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టికెట్లు