Rahul Gandhi : ప్రజాస్వామ్యం అత్యుత్తమ సాధనం
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
Rahul Gandhi : ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైన సమస్యలతో, సవాళ్లతో కొనసాగుతోంది. ఈ సమయంలో ఆయా దేశాలలో ఎన్నో విధాన పరమైన పద్దతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో భారత దేశం లాంటి దేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయని అన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఏఐసీసీ మాజీ చీఫ్ అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ లో పర్యటించారు. ఇదే క్రమంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో విద్యార్థులు, మేధావులను ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం న్యూయార్క్ లోని ప్రపంచంలోనే పేరు పొందిన రూజ్ వెల్ట్ హౌస్ పబ్లిక్ పాలసీ ఇన్ స్టిట్యూట్ ను సందర్శించారు రాహుల్ గాంధీ. ఈ సంస్థ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీతో ఆలోచనా పరులతో ములాఖత్ అయ్యారు. తన అద్భుతమైన సంభాషణతో ఆకట్టుకున్నారు. శాశ్వత ప్రభావాన్ని చూపారు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ స్వయంగా దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మేధావులతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడు కోవడం అన్నది ముఖ్యమన్నారు. వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ పోతే చివరకు ప్రపంచం ప్రమాదంలోకి నెట్టబడుతుందని దీనిని గమనించాలని సూచించారు ఏఐసీసీ మాజీ చీఫ్. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి పరిష్కారం కోసం ప్రయత్నం చేయక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.
Also Read : Romina Pourmokhtari