Deputy CM Pawan : జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభ నియమావళి పై అవగాహన కార్యక్రమం..

ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం కల్పించేలా కృషి చేయాలి...

Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ విధివిధానాలపై జనసేన శాసనసభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా అసెంబ్లీలో నడవాలని డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలందరూ సభా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. సభా సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. శాఖాపరమైన, ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు చర్చల్లో పాల్గొనవద్దని సూచించారు. మహిళల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.

Deputy CM Pawan Meet

జనసేనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారని, 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో అఖండ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపారని పవన్ ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. మొదటి 100 రోజుల్లో పరిపాలనాపరమైన అంశాలను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం కల్పించేలా కృషి చేయాలి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడవద్దని, గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పవన్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పర్యటనకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read : Ex CM YS Jagan : ప్రతిపక్ష నేత పదవి మరియు కీలక అంశాలపై స్పీకర్ కు లేఖ రాసిన జగన్

Leave A Reply

Your Email Id will not be published!