Deputy CM Pawan Kalyan: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు గల్లంతుపై పవన్ సీరియస్ !
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు గల్లంతుపై పవన్ సీరియస్ !
Deputy CM: గత ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చిందని… అవి వచ్చే అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయిని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వందల కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి అని అధికారులను పవన్ ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM) బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిధుల గోల్‌మాల్ పై ఆ కార్పొరేషన్ అధికారులు చెప్పిన వివరాలపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
Deputy CM Pawan Kalyan..
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,092 కోట్లు నిధి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ? అని పవన్ ప్రశ్నించారు. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు ? అని ఆయన నిలదీశారు. నిధుల మాయంపై వివరణ ఇవ్వాలని అడిగారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. దీనితో నిధులు ఎటు వెళ్లాయని, ఏం చేశారో సవివరంగా విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాశాఖలపై గురువారం డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
Also Read : UN Secretary Warns : త్వరలో యుద్ధం ముంచుకొస్తుంది అంటున్న యూఎన్ సెక్రటరీ