Tejashwi Yadav : గిరిరాజ్ సింగ్ పై తేజస్వి యాదవ్ కన్నెర్ర
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై నిప్పులు చెరిగారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆర్జేడీ ప్రచారానికి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిక్లేర్ చేశారు.
దీనిపై ఎలా భర్తీ చేస్తారంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తేజస్వి యాదవ్ ను నిలదీశారు. తాను జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్ ను ప్రస్తావిస్తూ షేర్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
దశల వారీగా యుద్ద ప్రాతిపదికన కొలువుల్ని భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఎంత సేపు ఎదుటి వాళ్ల మీద పడి ఏడ్వడం తప్పితే భారతీయ జనతా పార్టీకి ఇంకో పని లేదని మండిపడ్డారు.
ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాన మంత్రి మోదీ చెప్పారని ఎందుకు భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నించారు. దమ్ముంటే ముందు మీరు భర్తీ చేయాలని సవాల్ విసిరారు తేజస్వి యాదవ్.
అబద్దాల వాట్సాప్ , సోషల్ మీడియా యూనివర్శిటీ ని వేదికగా చేసుకుని ప్రతిపక్షాల మీద, నాయకుల మీద విమర్శలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నేళ్ల కాలంలో వాళ్లకు ఎక్కడా సమస్యలు కనిపించ లేదు. ఎంత సేపు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారే తప్పా ప్రజల కోసం ఆలోచించడం లేదని ఫైర్ అయ్యారు తేజస్వి యాదవ్(Tejashwi Yadav).
Also Read : తేజస్వి యాదవ్ పై సుశీల్ మోదీ ఫైర్