Deve Gowda Lauds : రైల్వే మంత్రి ప‌ని తీరు భేష్ – దేవె గౌడ

ఓ వైపు రాజీనామా చేయాల‌ని డిమాండ్

Deve Gowda Lauds : జేడీఎస్ చీఫ్ ,మాజీ ప్ర‌ధానమంత్రి దేవె గౌడ(Deva Gowda) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌న స్టాండ్ ఏమిటో చెప్ప‌క‌నే చెప్పారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ అద్బుతంగా ప‌ని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. మాజీ ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ జిల్లాలో కోర‌మాండల్ ఎక్స్ ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఆపై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అది వేగంగా వ‌స్తున్న హౌరా రైలును ఢీకొట్టింది. ఈ విషాద ఘ‌ట‌న‌లో భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగింది. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. యాంటీ డివైజ్ ను ఏర్పాటు చేయ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ఆమె గతంలో రెండు ప‌ర్యాయాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఆ వెంట‌నే స్పందించిన దీదీ దీనికి కేంద్ర‌మే బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

ఈ త‌రుణంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు రైల్వే శాఖ మంత్రిని బాధ్యుడిని చేశాయి. వెంట‌నే రాజీనామా చేయాల‌ని కోరాయి. గ‌తంలో మాధ‌వ‌రావ్ సింధియా, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశార‌ని దీనికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ అశ్వినీ వైష్ణ‌వ్ వెంట‌నే దిగి పోవాల‌ని కోరాయి. ఈ త‌రుణంలో మాజీ ప్ర‌ధాని ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో కొంత ఊపిరి పీల్చుకున్న‌ట్ల‌యింది భార‌తీయ జ‌న‌తా పార్టీకి.

Also Read : Nikhil Kamath Donate : ఈ దాన‌వుడు భార‌తీయుడు

 

Leave A Reply

Your Email Id will not be published!