Devendra Fadnavis : రేపే సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
బలపరీక్ష రద్దు చేసిన సెక్రటరీ
Devendra Fadnavis : మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే తప్పుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కోషియార్ కు అందజేశారు. ఆ వెంటనే రాజీనామాను ఆమోదించారు.
దీంతో రెండున్నర ఏళ్లుగా కొలువు తీరిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలి పోయింది. ఈ తరుణంలో ఎక్కువ సభ్యులు కలిగిన భారతీయ జనతా పార్టీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
దీనికి నాయకత్వం వహిస్తున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) చక్రం తిప్పారు. ఇప్పటికే ఆయన గవర్నర్ ను కలిసి లేఖ అందించారు.
ప్రస్తుత సర్కార్ మైనార్టీలో పడి పోయిందని, శివసేనకు చెందిన రెబల్స్ , ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిపి 50 మంది దాకా తమకు మద్దతు ఇస్తున్నారని గవర్నర్ కు విన్నవించారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం వరకు బల పరీక్షకు సిద్దం కావాలని ఆదేశించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేక పోయింది శివసేనకు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ ఏర్పడింది.
ఇక దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు. ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణం చేయనున్నారు. రెబల్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 12 మందికి కేబినెట్ లో చోటు దక్కనుంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కనున్నాయి.
మొత్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 143 సభ్యుల బలం ఉందని నిరూపించు కోవాలి. ఇప్పటికే 170 మంది సభ్యుల సంఖ్య ఉందని ఇప్పటికే ప్రకటించారు దేవేంద్ర ఫడ్నవీస్.
Also Read : ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ