INS Arighaat:  అణు జలాంతర్గామి.. ‘INS అరిఘాత్‌’ జాతికి అంకితం : మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

 అణు జలాంతర్గామి.. ‘INS అరిఘాత్‌’ జాతికి అంకితం : మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

INS Arighaat: భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఈ జలాంతర్గామిలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తిసామర్థ్యాలకు, శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ భారత నౌకాదళంలో రెండో అణు జలాంతర్గామి కావడం విశేషం. ఇప్పటి కి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ తన సేవలు కొనసాగిస్తోంది.

INS Arighaat..

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ మాదిరిగానే అరిఘాత్‌ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులోని ‘షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌’లో 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబరు 19న జలప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్‌ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు. సీ ట్రయల్స్‌ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు.

Also Read : Rahul Gandhi: భారత్‌ డోజో యాత్రకు రాహుల్‌ సిద్ధం !

Leave A Reply

Your Email Id will not be published!