DGP Anjani Kumar : రాష్ట్రమంతటా భారీ బందోబస్తు
స్వేచ్ఛగా ఓటు వేయండి
DGP Anjani Kumar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
DGP Anjani Kumar Comment
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) వెల్లడించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు నిరంతరంగా పర్యవేక్షణలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల సంఘం విధించిన రూల్స్ అతిక్రమించినా లేదా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, పోలీసు బలగాలు విస్తృతంగా నిఘాను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తాను పర్యవేక్షిస్తున్నానని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా విలువైన ఓటు హక్కును వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు డీజీపీ అంజనీ కుమార్.
ప్రతి కదలికలను సీసీ కెమెరాలలో రికార్డు చేస్తున్నట్లు తెలిపారు . ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. తనతో పాటు తన భార్య కూడా ఓటు హక్కు వినియోగించుకుందని చెప్పారు డీజీపీ.
Also Read : Mohammad Azharuddin : ఓటు వేసిన మహమ్మద్ అజహరుద్దీన్