Parliament Rule : పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాలు బంద్
విపక్షాలకు బిగ్ షాక్ రాజ్యసభ కొత్త రూల్
Parliament Rule : భారత పార్లమెంట్ లో ఎలాంటి ఆందోళనలు ఇక నుంచి చేపట్టేందుకు వీలు లేదంటూ సంచలన ప్రకటన చేసింది రాజ్యసభ.
ఇప్పటికే లోక్ సభ కొత్తగా ఎంపీలకు ముకుతాడు వేస్తూ విడుదల చేసిన ప్రవర్తనా నియమావళి బుక్ లెట్ తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. విపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఎట్టకేలకు దిగి వచ్చారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.
ఈ వివాదం ఇంకా సమసి పోక ముందే మరో వివాదాస్పద రూల్ జారీ చేయడంపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా జారీ చేసిన రూల్ ప్రకారం పార్లమెంట్ ఆవరణలో , లోపట ఎక్కడా సభ్యులు ఎటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహారదీక్షలు ఉపయోగించేందుకు వీలు లేదంటూ స్పష్టం చేసింది.
అంతే కాకుండా మత పరమైన వేడుకల కోసం పార్లమెంట్ హౌస్(Parliament Rule) ఆవరణను ఉపయోగించడం ఇక కుదరదని పేర్కొంది. ధర్నాలు లేదా నిరసనలపై సర్క్యులర్ తీసుకు రావడం కలకలం రేపింది.
గాగ్ ఆర్డర్ పై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. జూల్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కొత్తగా బులెటిన్ విడుదల చేయడం మరింత అగ్నికి ఆజ్యం పోసింది.
ఈ కొత్తగా జారీ చేసిన రూల్ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ చీఫ్ విప్ జైరాం రామేష్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్ పై. ఇదంతా మోదీ ఆడుతున్న నాటకం అంటూ కొట్టి పారేశారు.
Also Read : పార్లమెంట్ లో నోరు జారితే జాగ్రత్త