KTR : కొన్నేళ్లుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. గొప్ప విజన్ ఉన్న నాయకుడు. కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంత త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోతాడని తాను కలలో కూడా ఊహించ లేదన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
ఇవాళ హైదరాబాద్ లో ఆకస్మిక మరణం చెందిన గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన తండ్రిని, కుటుంబీకులను ఓదార్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. మా మద్య బంధం అన్నది 12 ఏళ్లు. మోస్ట్ పవర్ ఫుల్, డైనమిక్ లీడర్ గౌతమ్ రెడ్డి. ఒక రకంగా ఏపీకి తీరని లోటుగా ఆయన అభివర్ణించారు.
ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పస్టం చేశారు మంత్రి కేటీఆర్(KTR). ఇవాళ ఇలా మాట్లాడతానని తాను అనుకోలేదన్నారు. ఎప్పుడు కలిసినా చాలా విషయాల గురించి చెప్పడం, తాను ఏది చెప్పినా వినేవాడని గుర్తు చేసుకున్నారు.
మంచి స్నేహ శీలి. హైదరాబాద్ కు వస్తే తప్పకుండా కలుసుకునే వాళ్లమన్నాడు కేటీఆర్(KTR). ఉదయం తెలిసిన వెంటనే తాను నమ్మలేక పోయానని తీరా వైద్యులు డిక్లేర్ చేశారని తెలిసాక కన్నీటి పర్యంతం అయ్యానని చెప్పారు.
ఇదిలా ఉండగా గత నెలలో మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత వారం రోజుల పాటు దుబాయిలో జరిగిన ఎక్స్ పోలో పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్ కు వచ్చారు. ఇవాళ కన్ను మూశారు.
Also Read : ప్రత్యామ్నాయ వేదిక అవసరం