Digvijay Singh : కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో డిగ్గీ రాజా
రాజస్థాన్ సంక్షోభంతో అశోక్ గెహ్లాట్ కు బై
Digvijay Singh : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక దగ్గర పడుతుండడంతో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా బరిలో ఉంటారని భావించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నట్టుండి హై కమాండ్ ఆసక్తి చూపించక పోవడంతో మధ్య ప్రదేశ్ కు చెందిన మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేరు వినిపిస్తోంది. రాజస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంతో పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ గెహ్లాట్ కు కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు సమాచారం.
ఇప్పటి వరకు గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వచ్చారు సీఎం. ఆయనతో పాటు పలువురి పేర్లు కొత్తగా వినిపించాయి. మాజీ సీఎం కమల్ నాథ్ , ముకుల్ వాస్నిక్, దీపిందర్ హూడాతో పాటు కొత్తగా డిగ్గీ రాజా (దిగ్విజయ్ సింగ్ ) (Digvijay Singh) పేరు చోటు చేసుకుంది జాబితాలో. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి కోసం ఎన్నిక జరగనుంది. 19న పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ.
ఇప్పటి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈనెల 30 చివరి తేదీ దరఖాస్తు చేసుకునేందుకు. గాంధీ ఫ్యామిలీ నుంచి అశోక్ గెహ్లాట్ స్థానంలో దిగ్విజయ్ సింగ్ పోటీ చేయనుండగా గాంధీయేతర ఫ్యామిలీ నుండి అసమ్మతి వర్గానికి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. ఆఖరి రోజున నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Also Read : భారత అటార్నీ జనరల్ గా వెంకటరమణి