Digvijay Singh : కాంగ్రెస్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలంతా కలిసి కట్టుగా పని చేయాలని పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలన్నారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
లేక పోతే ఇవే చివరి ఎన్నికలు కావాల్సి వస్తాయని అన్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ముందుకు సాగాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఎందుకని మనం పోరాడ లేక పోతున్నామనే దానిపై ఫోకస్ పెట్టాలన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో హల్ చల్ చేస్తోంది నెట్టింట్లో.
కార్యకర్తలు కలిసి కట్టుగా రావాలన్నారు. ఎవరి దారుల్లో వారుంటే పార్టీ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. ప్రధాన పార్టీగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మనం ఇంకా మరింత శక్తివంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు దిగ్విజయ్ సింగ్(Digvijay Singh).
పని చేసే విధానం సరిగా లేదన్నారు. రాట్లాం జిల్లాలో పర్యటించారు. అక్కడి స్థానిక కార్యకర్తలతో డిగ్డీ రాజా చేసిన కామెంట్స్ తో పార్టీకి చెందిన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు విస్తు పోయారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇవాళ డిగ్గీ రాజా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. పని చేసే విధానం ఇది సరి కాదన్నారు. నిజాయితీగా ఉండండి.
పార్టీని బలోపేతం చేయండి. ముందుకు మీరంతా ఒకే తాటిపైకి రండి. పార్టీ మరింత బలోపేతంగా మారుతుందన్నారు. దిగ్విజయ్ సింగ్.
Also Read : బిశ్వ శర్మ కామెంట్స్ ప్రియాంక సీరియస్