Digvijaya Singh: బీజేపీ కోవర్టులపై రాహుల్ గాంధీకు దిగ్విజయ్ సింగ్ సూటి ప్రశ్న
బీజేపీ కోవర్టులపై రాహుల్ గాంధీకు దిగ్విజయ్ సింగ్ సూటి ప్రశ్న
Digvijaya Singh : గుజరాత్ కాంగ్రెస్ లోని కొందరు నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని… అవసరమైతే 30-40 మంది నాయకులపై వేటు వేసేందుకు వెనుకాడేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇటు బీజేపీలోనే కాకుండా సొంత పార్టీ నేతల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్(Digvijaya Singh) ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. పార్టీ కోవర్టులపై చర్య తీసుకోవాలని కోరారు. ”కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని రాహుల్ గాంధీ ఎప్పుడు బహిష్కరిస్తారు?” అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం దిగ్విజయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా గుజరాత్ కాంగ్రెస్ లో పెను దుమారం రేపుతోంది.
Digvijaya Singh – కోవర్టుల విషయంలో పాత అనుభవం గుర్తిచేసిన డిగ్గీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఒకసారి గుజరాత్ ప్రచారానికి వెళ్లానని, అప్పుడు తనకు ఒక అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా దిగ్విజయ్(Digvijaya Singh) చెప్పారు. గుజరాత్ ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు వ్యతిరేకంగా తనను మాట్లాడవద్దని, అలా చేస్తే హిందువులు మనస్తాపానికి గురికావచ్చని సూచనలిచ్చారని దిగ్విజయ్ తెలిపారు. బీజేపీ ఐడియాలజికల్ మెంటర్ ఆర్ఎస్ఎస్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. మతం పేరుతో హిందువులను ఆర్ఎస్ఎస్ వంచిస్తోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్‌కు హిందువులంటే గౌరవం లేదన్నదే నిజమని అన్నారు. వేలాది సంవత్సరాల క్రితం హిందూ ఆధ్యాత్మిక నేతలు స్థాపించిన శంకరాచార్యుల సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోందని, ఈ శంకరాచార్యుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను సపోర్ట్ చేసినవారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.
కోవర్టులపై రాహుల్ ఏమన్నరంటే
గుజరాత్ పర్యటనలో భాగంగా శనివారం అహ్మదాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ”మనలో కొందరు నేతలు రహస్యంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. వారెవరో మనం వడపోయాలి. లేకుంటే రాష్ట్ర ప్రజలు మనల్ని విశ్వసించరు. నాతో సహా అందరం రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లాలి. వారు చెప్పేది వినాలి. నా నుంచి ఏమాశిస్తున్నారు.. వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్ కోసం మనం ఏం చేస్తామో వారికి తెలియాలి” అని చెప్పారు. ప్రజలు బీజేపీ వలలో చిక్కుకున్నారని, గత 20-25 ఏళ్ల బీజేపీ విజన్ విఫలమైందని, కాంగ్రెస్ తేలికగా కొత్త విజన్ అందించగలదని తెలిపారు.
Also Read : Vice President Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ కు అస్వస్థత ఎయిమ్స్ లో పరామర్శించిన ప్రధాని మోదీ