బొమ్మరిల్లు సీక్వెల్ పై దిల్ రాజు కామెంట్స్

శంభాల మూవీ స‌క్సెస్ మీట్ లో కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన నిర్మాత‌ల‌లో ఒక‌రు ప్ర‌స్తుత తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నిర్మాత దిల్ రాజు. ఆయ‌న అస‌లు పేరు వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి. స్వ‌స్థ‌లం తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లా. త‌ను ఏది ప‌ట్టుకున్నా ఆ సినిమా త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని ప్ర‌చారం. త‌ను తీసిన సినిమాల‌లో కుటుంబ బంధాల‌కు , సున్నిత‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్స్ కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తూ వ‌స్తారు. గ‌తంలో తాను తీసిన బొమ్మ‌రిల్లు సినిమా ఎవ‌ర్ గ్రీన్ మూవీగా నిలిచి పోయింది. దీనికి కార‌ణం అంద‌రినీ, అన్ని వ‌ర్గాల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బిగ్ హిట్ గా నిలిచింది. ఇందులో న‌టించిన సిద్దార్థ్, జెనీలియా దేశ్ ముఖ్ ల‌కు మంచి పేరు కూడా వ‌చ్చేసింది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ కు చివ‌ర‌కు సినిమా స‌క్సెస్ తో ఏకంగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ గా మారి పోయారు. ఎంత‌లా అల్లుకు పోయిందంటే ఎవ‌రూ ఊహించ లేరు.

తాజాగా బొమ్మ‌రిల్లు నిర్మించిన దిల్ రాజు హైద‌రాబాద్ లో జ‌రిగిన శంభాల మూవీ స‌క్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా బొమ్మ‌రిల్లు సినిమా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశాడు. బొమ్మ‌రిల్లు సీక్వెల్ ఉండ‌వ‌చ్చ‌ని చూచూయిగా పేర్కొన‌డం విశేషం. శంభాల సాధించిన విజ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందులో అర్చన అయ్యర్, మధునందన్, ప్రవీణ్, అన్నపూర్ణమ్మ, స్వాసిక విజయ్, హర్ష వర్ధన్, రవి వర్మ, రంగధామ్, అయేషా మరియం, శివకార్తీక్ దండా న‌టించారు. శంభాల సాధించిన విజ‌యాన్ని ఆస్వాదిస్తున్నామ‌ని అన్నారు దిల్ రాజు.

Leave A Reply

Your Email Id will not be published!