Dinesh Kumar Tripathi: నూతన నేవీ చీఫ్ గా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి !

నూతన నేవీ చీఫ్ గా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి !

Dinesh Kumar Tripathi: నూతన నావికాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి(Dinesh Kumar Tripathi) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం త్రిపాఠి భారత నావికాదళ వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 1964 మే 15న జన్మించిన ఆయన 1985 జులై 1న భారత నేవీ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ ఫేర్‌ లో నిపుణుడిగా పేరుగాంచిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. వైఫ్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌ కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్‌ఎస్‌ వినాశ్‌ ను కమాండ్‌ చేసిన అనుభవమూ ఉంది.

Dinesh Kumar Tripathi Comment

వెస్టర్న్‌ ఫ్లీట్‌ కు ఆపరేషన్స్‌ ఆఫీసర్‌, నావల్‌ ఆపరేషన్స్‌ కు డైరెక్టర్‌, నెట్‌ వర్క్‌ సెంట్రిక్‌ ఆపరేషన్స్‌కు ప్రధాన డైరెక్టర్‌, ఢిల్లీలో నావల్‌ ప్లాన్స్‌ కు ప్రధాన డైరెక్టర్‌ గా గతంలో దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి పనిచేశారు. ఈస్టర్న్‌ ఫ్లీట్‌ లోనూ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ గా వ్యవహరించారు. ప్రఖ్యాత ఇండియన్ నావల్‌ అకాడమీకి కమాండంట్‌గానూ సేవలందించారు. రేవాలోని సైనిక్‌ స్కూల్‌, ఖడక్వాస్లాలోని ఎన్‌డీయే పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి… నావల్‌ వార్‌ కాలేజ్‌ గోవాతో పాటు యూఎస్‌ఏలోనూ వివిధ కోర్సులు పూర్తి చేశారు. అంతేకాదు భారత నావిదళంలో ఆయన సేవలకు గాను అతి విశిష్ఠ్‌ సేవా మెడల్‌, నౌసేన మెడల్‌ పురస్కారాలను అందుకున్నారు.

Also Read : Rajnath Singh: కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ !

Leave A Reply

Your Email Id will not be published!