Rajnath Singh: కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ !

కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ !

Rajnath Singh: ‘‘మీకు కుమారుడికి ఓటేయకపోయినా.. కనీసం అతడిని ఆశీర్వదించండి’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం మీరు చేసిన వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కాంగ్రెస్‌ ఒత్తిడి వల్ల అలా మాట్లాడి ఉండొచ్చు’’ అని అన్నారు. మరోవైపు తన తండ్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యలపై స్పందించిన అనిల్ ఆంటోని… కాంగ్రెస్‌లో కాలం చెల్లిన నేతలు ఉన్నారని… తన తండ్రి పరిస్థితి చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. పథనంథిట్టలో తన విజయం ఖాయమని స్పష్టంచేశారు.

Rajnath Singh Comment

కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని… బీజేపీలో చేరి కేరళలోని పథనంథిట్ట లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. దీనితో తన కొడుకు అనిల్ ఓడిపోవాలని… ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలంటూ ఏకే ఆంటోని రెండు రోజుల క్రితం పిలుపునిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నా మతం అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు భారత్‌, దాని రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినవి అయినందునే మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపధ్యంలో పథనంథిట్ట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్‌(Rajnath Singh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘ఏకే ఆంటోనీజీకి నేను చెప్పాలనుకునేది ఒక్కటే. మీ కుమారుడికి మీరు ఓటు వేయకపోయినా కనీసం ఆశీస్సులైనా అందించాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : CM Revanth Reddy : తెలంగాణను కేసీఆర్, మోదీ దోచుకున్నారు – సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!