Rahul Gandhi Marriage : రాహుల్ పెళ్లిపై తమిళనాడులో చర్చ
సరదాగా స్వీకరించిన కాంగ్రెస్ నేత
Rahul Gandhi Marriage : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ కు పేరుంది. దాదాపు 134 ఏళ్లకు పైగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది.
వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడానికి నానా తంటాలు పడుతున్నారు ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
భారత్ జోడో యాత్ర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇప్పటికే తమిళనాడులో పూర్తి చేసుకుంది.
కేరళలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. యువతతో పాటు మహిళలు ఎక్కువగా హాజరవుతున్నారు.
తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ వెంట సీనియర్ నాయకులు, సీఎంలు అశోక్ గెహ్లాట్ , భూపేష్ భాఘేల్ , దిగ్విజయ్ సింగ్ ఉన్నారు.
ఆదివారం కేరళకు చేరుకున్న రాహుల్ గాంధీతో కేసీ వేణు గోపాల్ తో పాటు శశి థరూర్ చేరారు. ఇదిలా ఉండగా పాదయాత్ర సందర్భంగా తమిళనాడులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
పెద్ద ఎత్తున తమిళ మహిళలు రాహుల్ తో మాట్లాడేందుకు ఉత్సుకత చూపించారు. ఇదే సమయంలో వారు రాహుల్ గాంధీ పెళ్లి(Rahul Gandhi Marriage) ప్రస్తావన తెచ్చారు.
తనను చేసుకునేందుకు తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎంతో మంది రెడీగా ఉన్నారంటూ స్పష్టం చేశారు. దీంతో రాహుల్ గాంధీ వారి మాటల్ని సరదాగా తీసుకున్నారు.
ఆపై ఓ చిరునవ్వు నవ్వి మళ్ల పాదయాత్రలో లీనమయ్యారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ, మహిళల మధ్య జరిగిన ఆసక్తికర చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ – జై శంకర్