Divya Gokulnath Byju : ‘బైజు’కు దివ్య గోకుల్ నాథ్ దిక్సూచి
టీచింగ్ పేషన్ సక్సెస్ సెన్సేషన్
Divya Gokulnath Byju : ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఆన్ లైన్ విద్యా సంస్థగా పేరు తెచ్చుకుంది భారత దేశానికి చెందిన బైజు సంస్థ. బీసీసీఐ ఆటగాళ్లకు స్పాన్సర్ గా ఎదిగే స్థాయికి చేరుకుంది. ఈ సంస్థ ఇంతలా ఎదగడానికి కారణం ఎవరో తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగించక మానదు.
కష్టాల్లో సైతం ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా , వనరులను గుర్తించి సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ దానంతట అదే వస్తుందని నమ్మారు దివ్య గోకుల్ నాథ్.
ఆమె బైజు సంస్థకు కో ఫౌండర్ గా ఉన్నారు. స్త్రీ వ్యవస్థాపకురాలిగా ఉండడం అంత సులభం కాదు. కానీ దివ్య గోకుల్ నాథ్ దానిని అధిగమించారు.
సమస్యలను తట్టుకున్నారు. అడ్డంకుల్ని అధిగమించారు. విజయపు బావుటా ఎగుర వేశారు. కానీ ఇక్కడే దివ్య గోకుల్ నాథ్ ఆగి పోలేదు. తల్లిదండ్రులు ఆమెను కలలు కనేలా ప్రోత్సహించారు. నేర్చుకోవడం పట్ల ఆమెకు ఉన్న ప్రేమ గణితాన్ని, సైన్స్ ను అధ్యయనం చేసేలా చేసింది.
కొత్తగా ప్రేరేపించేలా చేసింది. అదే బైజుగా రూపుదిద్దుకుంది. తన భర్త బైజు రవీంద్రన్ తో కలిసి ప్రయాణం చేసింది. అది వందల కోట్లను సాధించేలా చేసింది. నాకున్న అతి పెద్ద ప్రయోజనం నా అభిరుచి నా వృత్తితో కలిసి పోయేలా చేసిందని పేర్కొంది దివ్య గోకుల్ నాథ్(Divya Gokulnath Byju). మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తున్నప్పుడు మీరు ఎప్పుడూ కాలి పోయినట్లు అనిపించరు.
కంటెంట్ , బ్రాండ్ మార్కెటింగ్ ను నిర్వహిస్తోంది. 70 మిలియన్ల మంది రిజిష్టర్డ్ విద్యార్థులు బైజులో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. వెంచర్ క్యాపిటల్ 340 మిలియన్లకు పైగా ఉంది.
బైజు రవీంద్రన్ , దివ్య గోకుల్ నాథ్ (Divya Gokulnath Byju) 3.05 బిలియన్ డాలర్ల నికర విలువ సుమారు రూ. 22.3 వేల కోట్లు కలిగి ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారో దానిపైనే ఫోకస్ పెట్టింది. అదే మిమ్మల్ని విజేతగా నిలిచేలా చేస్తుందని అంటారు దివ్య గోకుల్ నాథ్.
Also Read : సివిక్ స్టూడియోస్ మాస్ వాయిస్