DK Shiva Kumar : పాటిల్ యత్నాల్ ను సస్పెండ్ చేయాలి
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్
DK Shiva Kumar : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక స్థాయి కలిగిన నాయకుడై ఉండి ఒక మహిళ పట్ల ఇలాంటి చౌకబారు కామెంట్స్ చేయడం దారుణమన్నారు.
ఇదిలా మొత్తం మహిళా సమాజానికి ఘోరమైన అవమానమని పేర్కొన్నారు. నిత్యం దేశం,సంస్కృతి, సంప్రదాయాలు , నాగరికత గురించి పదే పదే పాఠాలు చెప్పే బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీని వ్యక్తిగతంగా దూషించిన పాటిల్ యత్నాల్ పై ఏం చెబుతారంటూ ప్రశ్నించారు డీకే శివకుమార్.
రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు హుందాగా ఉండాలని, ప్రవర్తించాలని అన్నారు. చరిత్ర తెలుసు కోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే అది సంస్కారం అనిపించు కోదన్నారు డీకే శివకుమార్. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి ఉందన్నారు. ఆనాడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు కేపీసీసీ చీఫ్(DK Shiva Kumar).
దేశ సమగ్రత కోసం ప్రధానమంత్రి పదవిని కాదనుకున్న గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బసనగౌడ పాటిల్ యత్నాల్ సోనియాను ఉద్దేశించి విష కన్య అంటూ కామెంట్ చేశారు. ఏ మాత్రం మహిళల పట్ల గౌరవం ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాటిల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు డీకే శివకుమార్.
Also Read : సోనియాపై కామెంట్స్ కాంగ్రెస్ ఫైర్