DK Shiva Kumar : పాలనా వ్యవస్థకు పేరు తీసుకు రావాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం శివకుమార్
DK Shiva Kumar : సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన వారంతా పాలనా వ్యవస్థకు మంచి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. శనివారం శ్రీ ఆదిచుంచనగరి మహా సంస్థాన మఠం ఆధ్వర్యంలో గత ఏడాది 2022లో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు డీకే శివకుమార్. ప్రతిభ కనబర్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందనలు తెలిపారు.
గతంలో చదువు కోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవన్నారు. కానీ ఇవాళ తరం మారిందని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రత్యేకించి టెక్నాలజీ పెరిగిందన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారని చెప్పారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
ఈ దేశంలో పాలనా పరంగా కీలకమైన పాత్ర పోషించేది సివిల్ సర్వీస్ కు చెందిన వారేనని పేర్కొన్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ముఖ్య భూమిక పోషిస్తారని చెప్పారు. తమ కష్టార్జితంతో సివిల్స్ కు ఎంపిక కావడం మామూలు విషయం కాదన్నారు. ఎంపికైన అభ్యర్థులు నీతి, నిజాయితీతో , సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, దేశానికి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం.
Also Read : Devanuru Mahadeva : దేవనూరు మహాదేవ కలకాలం జీవించు