DK Shiva Kumar : ప్రజా నాయకుడు దేవరాజ్ ఉర్స్
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shiva Kumar : కర్ణాటక మాజీ సీఎం దివంగత దేవరాజజ్ ఉర్స్ వర్దంతి ఇవాళ. భారత దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన అరుదైన నాయకుడు. కన్నడ నాట అజాత శత్రువుగా పేరు పొందిన పొలిటికల్ లీడర్. ఈ సందర్భంగా కర్ణాటక పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) నివాళులు అర్పించారు. దేవరాజ్ ఉర్స్ ధృడమైన రాజకీయ నాయకుడని, సామాజిక విప్లవానికి మార్గ దర్శకుడని కొనియాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన గొంతును వినిపించిన ఏకైక దమ్మున్న లీడర్ అని పేర్కొన్నారు. తన దూరదృష్టితో కూడిన పరిపాలన ద్వారా కర్ణాటక అభివృద్ది గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు.
కొన్ని తరాల పాటు గుర్తు పెట్టుకునేలా దేవరాజ్ ఉర్స్ పాలన సాగించారు కర్ణాటకలో. 1972 నుంచి 1977, 1978 నుంచి 1980 దాకా మొదటి సీఎంగా రెండు పర్యాయాలు పని చేసిన ఘనత ఆయనకే దక్కింది. అత్యధిక కాలం పని చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1952లో రాజకీయాల్లోకి వచ్చిన దేవరాజ్ ఉర్స్ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1969లో భారత జాతీయ కాంగ్రెస్ విడి పోయినప్పుడు ఆయన ఇందిరా గాంధీ వైపు నిలిచారు.
దేవరాజ్ ఉర్స్ కు చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే పంచ ప్రాణం. కానీ ఆయనలోని నాయకత్వ గుణం ఒకచోట ఉండనీయలేదు. కర్ణాటక రాజకీయాలలో ఆరితేరిన నాయకులు ఎస్. నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ , రామకృష్ణ హెగ్డే , దేవెగౌడ లాంటి ఉద్దండులను తట్టుకుని నిలబడ్డారు దేవరాజ్ ఉర్స్. అయన చని పోయే కంటే కొన్ని నెలల ముందు కర్ణాటక క్రాంతి రంగ అనే పార్టీని స్థాపించారు.
Also Read : John Kirby : భారత దేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యం