DK Shiva Kumar : రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం
డ్రైనేజీ వ్యవస్థ లోపంపై ఫోకస్
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) గురించి ఎంత చెప్పినా తక్కువే. పీసీసీ చీఫ్ గా తన సారథ్యంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చారు. అంతే కాదు మోదీ చరిష్మాను, అమిత్ షా ప్లాన్స్ ను తట్టుకుని కన్నడ నాట కాంగ్రెస్ జెండాను ఎగుర వేశాడు. ఆపై అఖండ విజయాన్ని తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. బీజేపీలో అమిత్ షాకు ట్రబుల్ షూటర్ గా పేరు ఉంటే కాంగ్రెస్ లో డీకేఎస్ కు కూడా సేమ్ పేరుంది.
రాజకీయాలలో తల పండిన ఈ నాయకుడు మోస్ట్ పాపులర్. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యాక్షన్ లోకి దిగాడు. తనకు కేటాయించిన శాఖకు సంబంధించి సమీక్షలు జరిపారు. విస్తృతంగా పర్యటించడం ప్రారంభించాడు. ఓ వైపు పార్టీ చీఫ్ గా ఉంటూనే మరో వైపు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యాన్ని తీసుకు రావాలన్నదే తన లక్ష్యమని ఇప్పటికే డీకే శివకుమార్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఈసారి బీజేపీకి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎక్కువ సీట్లు పొందింది. అందుకే నగరంలో పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే పనిలో పడ్డారు డిప్యూటీ సీఎం. ఆయన పట్టణాభివృద్ది శాఖను తీసుకున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ముందు జాగ్రత్తగా బెంగళూరులోని యెమలూరు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు డీకే శివకుమార్. వరదలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read : CM Siddaramaiah : కర్ణాటక సీఎం ప్రజా దర్బార్