DK Shivakumar : కన్నడ నాట కాంగ్రెస్ దే హవా
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్
DK Shivakumar : ప్రస్తుతం కన్నడ నాట రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్. ప్రస్తుతం ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయన నందిని మిల్క్ స్టోర్ ను కూడా సందర్శించారు. ఇదే సమయంలో కనకపురలో భారీ ఎత్తున హాజరైన జనవాహినిని చూసి ఉత్సాహం వ్యక్తం చేశారు.
మీ అందరినీ చూస్తుంటే ఫలితం స్ఫష్టంగా కనిపిస్తోందని చెప్పారు డీకే శివకుమార్(DK Shivakumar). 224 సీట్లలో కనీసం 150 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది లేదని, పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సీఎం బొమ్మై కేవలం ఒక బొమ్మ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రిమోట్ కంట్రోల్ అంతా మోదీ, అమిత్ షా చేతుల్లో ఉందంటూ ఆరోపించారు.
ఎన్ని రకాలుగా హామీలు గుప్పించినా ప్రజలు వినిపించుకునే పరిస్థితిలో లేరన్నారు డీకే శివకుమార్(DK Shivakumar). ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని, కేవలం ఓట్లు వేసేందుకు మాత్రమే వేచి చూస్తున్నారని చెప్పారు. ప్రతి పనికి కమీషన్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చాక ప్రకటించిన హామీలన్నింటినీ స్వల్ప కాలంలోనే నెరవేరుస్తామని చెప్పారు. బీజేపీ నుంచి వలసలు ఇంకా వస్తాయని ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు డీకేఎస్.
Also Read : నందిని పాల ఉత్పత్తులు భేష్
