Ashwini Vaishnav : రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దు – వైష్ణవ్
దయచేసి అర్థం చేసుకోండి
Ashwini Vaishnav : అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే నిరసనకారులు రైళ్లు, రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారు. పలు రైళ్లను ధ్వంసం చేశారు.
బోగీలను తగుల బెట్టారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ విధ్వంసానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది కేంద్ర రైల్వే శాఖకు. ఇప్పటికే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది.
ఈ తరుణంలో గత మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతుండగా శుక్రవారం తెలంగాణలో ఆ విధ్వంసం ఉగ్ర రూపం దాల్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది.
రక్తం చిందింది. కాల్పులు జరిపేంత దాకా కొనసాగింది ఈ ఆందోళన. దీంతో కేంద్రం ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్ లలో పోలీసులను మోహరించారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) స్పందించారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. రైల్వేలు జాతీయ ఆస్తి అని. వాటిని దయచేసి ధ్వంసం చేయవద్దంటూ కోరారు.
నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోగలమని, కానీ నిరసన తెలిపే పద్దతి ఇది కాదని పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని కానీ ఇలా ప్రభుత్వ ఆస్తులను టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని సూచించారు.
దీని వల్ల కేంద్రానికి తీరని నష్టం చేకూరిందన్నారు. నిరసనలు, ఆందోళనలు హింసాత్మక మార్గంలో వెళ్లనీయవద్దని కోరారు అశ్వినీ వైష్ణవ్.
ఇప్పటి దాకా జరిగిన ఆందోళనలతో పెద్ద ఎత్తున రైళ్లు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.
Also Read : చంపే హక్కు మీకు ఎవరిచ్చారు
[VIDEO] #Agnipath protests: What Railways Minister said
LINK – https://t.co/OXKCVL9VwO pic.twitter.com/2KWmlxBPrI
— OTV (@otvnews) June 17, 2022