Kiren Rijiju : బెయిల్ పిటిషన్లను విచారించ వద్దు – రిజిజు
పార్లమెంట్ లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో ఆయన సుప్రీంకోర్టుపై సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లను స్వీకరించ కూడదన్నారు కిరెన్ రిజిజు. దేశ వ్యాప్తంగా ఆయా కోర్టులలో లెక్కకు మించి కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.
దీని కారణంగా అసలైన కేసులు పరిష్కారానికి నోచు కోవడం లేదన్నారు కేంద్ర మంత్రి. దీనిపై భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం పునరాలోచించాలని సూచించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయమూర్తులు ఫోకస్ పెట్టాలన్నారు.
ఇందులో భాగంగా బెయిల్ పిటిషన్లను ఎట్టి పరిస్థితుల్లో విచారించ కూడదన్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. ఆయనకు స్వేచ్ఛ అంటే కూడా తెలుసా అని ప్రశ్నించారు.
కేసులు పెండింగ్ లో ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం బెయిల్ పిటిషన్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల అసలైనవి పక్కన పడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ గా పేరు మార్చే బిల్లుపై రాజ్యసభ ఆమోదించింది.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర మంత్రి కిరన్ రిజిజు(Kiren Rijiju) ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా న్యాయ వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయకుండా ఇలా మంత్రి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు సిబల్.
Also Read : సామరస్యం ఆర్థిక వ్యవస్థకు బలం