S Jai Shankar : పాకిస్తాన్ ను పరిగణలోకి తీసుకోం – జై శంకర్
షాకింగ్ కామెంట్స్ చేసిన విదేశాంగ మంత్రి
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిన్ లాడెన్ మరణించాడని కానీ గుజరాత్ కసాయి మోదీ ఇంకా బతికే ఉన్నాడని మండిపడ్డారు.
దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది బీజేపీ. భారత్ లో పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఇంకోసారి నోరు పారేసుకుంటే పాకిస్తాన్ కు తగిన రీతిలో జవాబు ఇస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగానే..ఈ వివాదం కొనసాగుతుండగానే పుండు మీద కారం చల్లినట్లు పాకిస్తాన్ మంత్రి షాజియా మర్రి సంచలన ఆరోపణలు చేశారు.
ఆపై భారత్ పై నోరు పారేసుకున్నారు. తమను తక్కువగా అంచనా వేయొద్దని అణు బాంబు ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి జోక్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. భారత్ శాంతి కోసం ప్రయత్నం చేస్తుందని కావాలని కయ్యానికి కాలు దువ్వితే పాకిస్తాన్ ను మట్టు పెట్టడం పెద్ద పని కాదన్నారు.
ఈ తరుణంలో సోమవారం జై శంకర్(S Jai Shankar) పాకిస్తాన్ వ్యవహారంపై స్పందించారు. ఆ దేశానికి అంత సీన్ లేదన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ నీతులు వల్లించే పాక్ కు భారత్ ను అనే అర్హత లేదన్నారు. దానిని తాము ఒక దేశంగా పరిగణించే ప్రసక్తి లేదన్నారు.
ఇండియా జపాన్ సమ్మేళనం సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని గొప్పలు చెప్పుకునే హీన స్థితికి ఆ దేశం చేరిందన్నారు.
Also Read : రష్యన్లపై మోదీ ఎఫెక్ట్ – సీఐఏ చీఫ్