Kuldeep Singh Dhaliwal : చ‌ట్ట వ్య‌తిరేక శ‌క్తుల‌ను స‌హించం

ఆప్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్

Kuldeep Singh Dhaliwal : రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌ట‌మేత‌మ ల‌క్ష్య‌మ‌న్నారు ఆప్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్(Kuldeep Singh Dhaliwal). చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఎవ‌రు ప‌ని చేసినా లేదా అలాంటి ప్ర‌య‌త్నాలు చేసినా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త మూడు రోజులుగా ప్ర‌ముఖ ఖ‌లిస్తానీ వేర్పాటు వాద నాయ‌కుడు అమృత పాల్ సింగ్ కోసం వేట కొన‌సాగుతోంద‌న్నారు. పోలీసుల‌కు చిక్కిన‌ట్టే చిక్కి పారి పోయాడు. గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉగ్ర‌వాద‌, ఆయుధాలు క‌లిగి ఉన్నార‌నే దానిపై అమృత పాల్ సింగ్ పై కొత్త‌గా కేసు న‌మోదు చేశారు. ఇదే విష‌యాన్ని జ‌లంధ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఇంకా సింగ్ ను ప‌ట్టుకునేందుకు ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌న్నారు మంత్రి కుల్దీప్ సింగ‌గ్ ధాలివాల్. ఇటీవ‌లి నెల‌ల్లో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్న అమృత పాల్ సింగ్ , అత‌డి సంస్థ వారిస్ పంజాబ్ దే స‌భ్యుల‌పై కొర‌డా ఝులిపించింది పంజాబ్ పోలీస్. ఎక్క‌డిక‌క్క‌డ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

మ‌రో వైపు లండ‌న్ లో భార‌త హై క‌మిష‌న్ వ‌ద్ద హ‌ల్ చ‌ల్ చేశారు. చివ‌ర‌కు భార‌తీయ ప‌తాకాన్ని కింద‌కు దించి వేశారు. దీనిపై భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు అమృత పాల్ సింగ్ కు చెందిన 114 మంది అనుచ‌రుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. దేశ‌, విదేశాల నుంచి అభినంద‌న‌లు వ‌స్తున్నాయ‌ని సీఎంకు తెలిపారు.

Also Read : కాన్సులేట్ పై దాడి దారుణం

Leave A Reply

Your Email Id will not be published!