Dokka Manikya Vara Prasad : 26 నుంచి బస్సు యాత్ర
డొక్కా మాణిక్య వర ప్రసాద్
Dokka Manikya Vara Prasad : ఆంధ్ర ప్రదేశ్ – మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 26 నుంచి బస్సు యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అరుదైన అవకాశం ఇచ్చారని చెప్పారు.
Dokka Manikya Vara Prasad Comment
బుధవారం డొక్కా మాణిక్య వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శాసన మండలి విప్ గా నియమించారు. ఈ సందర్భంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వర ప్రసాద్(Dokka Manikya Vara Prasad) , లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఇవాళ సమావేశం అయ్యారు.
గతంలో కంటే మెరుగ్గా 175 సీట్లు గెలవాలని ఇందు కోసం గుంటూరు జిల్లాలో స్వీప్ చేయాలని కంకణం కట్టుకున్నామని ఈ సందర్బంగా స్పష్టం చేశారు డొక్కా మాణిక్య వర ప్రసాద్. జగన్ సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, మరింత ప్రచారం చేసేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇవాళ జగనన్న సురక్ష చేపట్టిన పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని చెప్పారు . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ది పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు డొక్కా మాణిక్య వర ప్రసాద్.
Also Read : Ambati Ram Babu : లోకేష్ ప్రమేయం టీడీపీ నాశనం
