Donald Trump : మస్క్ ట్విట్టర్ కైవసం ట్రంప్ సంతోషం
తెలివైన వ్యక్తి చేతిలో ఉందన్న మాజీ చీఫ్
Donald Trump : ప్రపంచ కుబేరుడు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్(Elon Musk) రూ. 4,400 కోట్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొదట డీల్ ఓకే చేసుకున్న ఎలాన్ మస్క్ ఆ తర్వాత తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి దాకా ఉత్కంట రేపింది.
మస్క్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ట్విటర్ యాజమాన్యం. ఆపై కోర్టును ఆశ్రయించింది. తమకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ మధ్యలోనే ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ పై భగ్గుమన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి.
ట్వీట్ల యుద్దం కొనసాగింది ఇద్దరి మధ్య . చివరకు అక్టోబర్ 28 వరకు డెడ్ లైన్ విధించింది అమెరికా కోర్టు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశాడు ఎలాన్ మస్క్. ఈ సందర్బంగా ఆయనపై మరో ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
డొనాల్డ్ ట్రంప్ వెనుక ఉండి ఇదంతా కొనుగోలు చేసేలా చేశాడని. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన మస్క్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). ఈ మేరు స్పందిస్తూ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు.
తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. తెలివైన చేతిలో ఉంది ట్విట్టర్. అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చిందన్నాడు.
Also Read : మస్క్ పై అగ్నిహోత్రి కామెంట్స్