Donald Trump : బైడెన్ పై భగ్గుమన్న ట్రంప్
ఇరికించేందుకు ప్రయత్నం
Donald Trump : మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని పరితపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన ప్రధానంగా ప్రస్తుత చీఫ్ జోసెఫ్ బైడెన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తనను కావాలని ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నాడంటూ ప్రెసిడెంట్ పై ట్రంప్ ఆరోపించారు. అయినా తాను ఎవరికీ లొంగే ప్రసక్తి లేదన్నారు. మరోసారి పోటీ చేస్తానని , గెలిచే సత్తా తనకు ఉందంటూ కుండ బద్దలు కొట్టారు ట్రంప్.
రహస్య పత్రాలు కలిగి ఉన్నానంటూ మియామి లోని ఫెడరల్ కోర్టు హౌస్ కు పిలిపించారంటూ ధ్వజమెత్తారు. తాను ఏర్పాటు చేసిన ట్రూత్ సోషల్ వేదికగా ఈ కీలక ఆరోపణలు చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన కీలక మీడియా సంస్థలు మాత్రం అమెరికా మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు మోప బడ్డాయని పేర్కొన్నాయి. కానీ ధృవీకరించ లేదు ఫెడరల్ కోర్టు.
ఇప్పటకే లైంగిక వేధింపుల కేసుతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వైట్ హౌస్ పై ట్రంప్ అనుచరుల దాడి ఘటనకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. తన వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ తరుణంలో రహస్య పత్రాలు కలిగి ఉన్నారనే ప్రధాన ఆరోపణలతో మరోసారి కోర్టు మెట్లు ఎక్కున్నాడు. ఇదిలా ఉండగా ట్రంప్ తరపు న్యాయవాదులు బైడెన్ పై విమర్శల వర్షం కురిపించారు.
Also Read : Birsa Munda : నిప్పు కణం బిర్సా ముండా