Mamata Banerjee HC : పంతుళ్ల నియామకాల రద్దు వద్దు – సీఎం
కోర్టును కోరిన మమతా బెనర్జీ
Mamata Banerjee Urges HC : టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ జాబ్స్ కుంభకోణంకు సంబంధించి కోర్టుకు విన్నవించారు జాబ్స్ నియామకాలు రద్దు చేయొద్దంటూ. సర్వీసులను రద్దు చేయాలనే నిర్ణయాలకు సంబంధించి పునరాలోచించాలని కోరారు. అయితే ఇదే సమయంలో ఈ స్కాంకు సంబంధించి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిని పునః పరిశీలనను పరిగణించాలని సూచించింది. టీచర్ల నియామకాలను రద్దు చేయొద్దని మమతా బెనర్జీ(Mamata Banerjee Urges HC) రాష్ట్ర హైకోర్టును కోరారు.
ఇదిలా ఉండగా జాబ్స్ స్కాం దేశంలోనే సంచలనం రేపింది. మరో వైపు తెలంగాణలో సైతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. తాజాగా భర్తీ ప్రక్రియలో తప్పులు జరిగితే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. ఎవరినీ సేవల నుండి తొలగించ వద్దని పశ్చిమ బెంగాల్ సీఎం విన్నవించారు కోర్టుకు.
రిక్రూట్ మెంట్ ప్రక్రియలో అవకతవకల ద్వారా పశ్చిమ బెంగాల్ లోని రాష్ట్ర ప్రాయోజిత , రాష్ట్ర సహాయక పాఠశాలల్లో చట్ట విరుద్దంగా బోధన, బోధనేతర సిబ్బందిగా నియమితులైన వేలాది మంది వ్యక్తుల సేవలను కోల్ కతా హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సీఎం(Mamata Banerjee) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
నేను ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు నన్ను తిడితే పర్వాలేదు. తెలసి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. అధికారం లోకి వచ్చాక సీపీఎం కార్యకర్తల జాబ్స్ తీయలేదు. మీకు ఉద్యోగం ఇచ్చే సామర్థ్యం ఎలాగూ లేదు. కానీ మీరు ప్రజల జీవనోపాధిని కొల్లగొడుతున్నారంటూ మండిపడ్డారు సీఎం. కేసు వేసిన సీపీఎం ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్యాను.
Also Read : అసెంబ్లీ బరిలో డీకే సోదరుడు