Passport Renewal : పాస్‌పోర్టు రెన్యూవల్ లో జాప్యం వద్దు
ముందస్తుగా దరఖాస్తు చేసుకోండి
Passport Renewal : విదేశాలలో చదువు కోవాలని అనుకుంటున్నారా. ఎక్కడికైనా వెళ్లాలంటే పాస్ పోర్టు ఉండాల్సిందే. కొన్ని దేశాలకు ఎలాంటి పాస్ పోర్ట్ లేక పోయినా వెళ్లవచ్చు.
కానీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్ , తదితర దేశాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
ఈ తరుణంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడం, ఆపై రాలేదని బాధ పడటం జరుగుతోంది. ప్రధానంగా కరోనా కారణంగా చాలా దేశాలకు సంబంధించిన కార్యాలయాలు బోసి పోయాయి.
కానీ తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడం, ఆయా దేశాలకు రాక పోకలు సాగిస్తుండడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఇక చదువుకునే స్టూడెంట్స్ మాత్రం వెంటనే దరఖాస్తు చేసుకోండి.
కొద్ది రోజుల్లోనే ప్రక్రియ పూర్తయి పాస్ పోర్టు వస్తుంది. దరఖాస్తు ప్రక్రియను ఆలస్యం చేస్తే అత్యవసర పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రెన్యూవల్, రీ ఇష్యూ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సమానంగా మొదటిసారిగా పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సమానంగా ఉందని పాస్ పోర్ట్(Passport Renewal) కార్యాలయం చెబుతోంది.
పాస్ పోర్టు గడువు తేదీ తెలిసినా రెన్యూవల్ చేయడంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రెండు రోజుల్లో జీఆర్ఈ, టోఫెల్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులకు సంబంధించి పాస్ పోర్టులు తప్పనిసరిగా అడుగుతారు. ముందు జాగ్రత్తగా రెన్యూవల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : సంకీర్ణ సర్కార్ల వల్లే భారత్ ఇమేజ్ డ్యామేజ్