DOST Notification: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
DOST Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ‘దోస్త్’ నోటిఫికేషన్‌ను(DOST Notification) విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు.
మొదటి ఫేజ్: మే 3 నుంచి 21 వరకు మొదటి ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు.
రెండో ఫేజ్: మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 13న సీట్ల కేటాయింపు.
మూడో ఫేజ్: జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 23న సీట్ల కేటాయింపు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం.
DOST Notification – గ్రూప్-1 అంశంపై తదుపరి విచారణ జూన్ 11కు వాయిదా
టీజీపీఎస్సీ గ్రూప్-1 వ్యవహారంపై హైకోర్టులో విచారణ జూన్ 11కి వాయిదా పడింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది. శుక్రవారం పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ(TGPSC) తరఫున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు.
రీకౌంటింగ్‌లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. వెకేషన్ లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. కాగా.. విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. వేలాది మందికి సంబంధించిన విషయం గనక తొందరపడవద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయొద్దని టీజీపీఎస్సీకి సూచించారు. అనంతరం విచారణను జూన్ 11కు వాయిదా వేశారు.
Also Read : Congress BC Leaders: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన కాంగ్రెస్ బీసీ నేతలు