Double Murder: ఉలిక్కిపడిన పల్నాడు ! వెల్దుర్తి మండలంలో టీడీపీ నాయకుల జంట హత్యలు !

ఉలిక్కిపడిన పల్నాడు ! వెల్దుర్తి మండలంలో టీడీపీ నాయకుల జంట హత్యలు !

 

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లను దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని స్కార్పియోతో వెంబడించారు. ఆ తర్వాత బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. ఆ ఇద్దరిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మృతులను ఢీకొన్న స్కార్పియో వాహనం టీడీపీ నేత వెంకట్రామయ్యదిగా గుర్తించారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వెంకట్రామయ్య వర్గం ఇటీవలే వైసీప నుంచి టీడీపీలోకి వచ్చింది. దీనితో ఈ ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరుకుని జంట హత్యలకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

రాజకీయ కారణాలతోనే ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరిని కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రశోకంలో మునిగిపోయాయి. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీతో ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. హత్యకు జరిగిన కారణాలు, ఈ ఘటన పూర్వాపరాలను ఎస్పీని అడిగి మంత్రి గొట్టిపాటి తెలుసుకున్నారు. వెంటనే హోంమంత్రి అనితతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం ప్రకటించారు. టీడీపీ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

 

 

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! నలుగురి మృతి !

 

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా వాహనంలో ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Leave A Reply

Your Email Id will not be published!