#DrShilpiReddy : స్త్రీల పాలిట దేవత డాక్టర్ శిల్పి రెడ్డి
నిబద్ధతకు నిదర్శనం ఈ డాక్టర్ స్వంతం
Dr Shilpi Reddy: ఈ కాలంలో ఆరోగ్యం, వైద్యం అన్నది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. ఈ తరుణంలో కుటుంబంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని, ఎన్నో శారీరక, మానసిక వత్తిళ్ళను తట్టుకుని నెట్టుకొస్తున్న మహిళలకు తన వైద్య చికిత్సలతో స్వాంతన చేకూరుస్తున్నారు డాక్టర్ శిల్పి రెడ్డి. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రముఖమైన డాక్టర్లలో ఆమె కూడా ఒకరు. మహిళలు నిత్యం ఎదుర్కునే సమస్యలకు ఆమె మెరుగైన, మేలైన వైద్యాన్ని అందజేస్తున్నారు. వారిలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. ప్రత్యేకించి డాక్టర్ గా ఎన్నో ప్రత్యేకతలు, అపారమైన అనుభవం కలిగిన శిల్పి రెడ్డి (Dr Shilpi Reddy) స్త్రీ వైద్య నిపుణురాలిగా రాణించారు. అంతే కాకుండా వైద్య పరంగా ఎన్నో మార్పులు తీసుకు వచ్చేలా కృషి చేశారు.
ఈ సిటీలో మోస్ట్ వాంటెడ్ డాక్టర్ గా వినుతికెక్కారు. సీనియర్ కన్సల్టెంట్ గా పలు పేరొందిన ఆసుపత్రుల్లో సేవలు అందించారు. ఉన్నతమైన పదవులు చేపట్టారు. ప్రస్తుతం డాక్టర్ శిల్పి రెడ్డి(Dr Shilpi Reddy) కిమ్స్ హాస్పిటల్ లో కీలకమైన గైనకాలజి విభాగానికి హెచ్ఓడిగా ఉన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, మినిమల్ ఇన్వాసివ్ సర్జన్ గా సేవలు అందజేస్తున్నారు. గర్భిణీలకు ఆమె అందిస్తున్న వైద్యం ఓ వరంగా మారింది. గర్భం దాల్చడం, పిల్లలకు జన్మను ఇవ్వడం అన్నది మహిళల్లో చాలా కీలకం. ఇటీవల ప్రెగ్నెన్సీకి సంబంధించి సాంకేతిక పరంగా మెరుగైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే చాలా మంది మహిళలు సిజేరియన్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మాతృత్వపు మాధుర్యానికి దూరమవుతున్నారు.
అంతే కాకుండా పిల్లలకు పాలు ఇస్తే అందం చెడిపోతుందన్న భ్రమల్లో ఉన్నారు. సరైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోగలిగితే సుఖ ప్రసవం జరిగేలా చేయవచ్చు అంటున్నారు డాక్టర్ శిల్పి రెడ్డి(Dr Shilpi Reddy). హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు ఎన్నింటినో పరిష్కరించిన అనుభవం ఆమెకు ఉన్నది. ఈ చికిత్సలో దాదాపు కొన్నేళ్ల అనుభవం ఉంది. హైదరాబాద్ లోని యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుండి ప్రసూతి, గైనకాలజీలో తన డిగ్రీని పూర్తి చేసింది. తమిళనాడులోని అన్నామలై విశ్వ విద్యాలయం నుండి డయాబెటాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. ఇమేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సీనియర్ రిజిస్ట్రార్ గా పని చేశారు. లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రాకేశ్ సిన్హా పర్యవేక్షణలో శిల్పి రెడ్డి ఫెలోషిప్ పూర్తి చేశారు.
ఒయాసిస్ సెంటర్ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ విభాగంలో ఫెలోషిప్ పొందారు. అమీర్‌పేటలోని అనుపమ నర్సింగ్ హోమ్‌లో కన్సల్టెంట్ గా, డయాబెటాలజిస్ట్, సర్జన్‌గా పని చేశారు. రెయిన్ బో, ఫెమినాలో సర్జికల్ కన్సల్టెంట్ గా సేవలు అందజేశారు. బర్త్ ప్లేస్ హాస్పిటల్ లో లీడ్ కన్సల్టెంట్ గా కూడా పని చేశారు. గత పదేళ్లుగా ప్రెగ్నెన్సీ, గైనకాలజీకి సంబంధించి ఎన్నో క్లిష్టమైన రోగాలకు శాస్త్ర చికిత్సలు చేసిన ఘనత డాక్టర్ శిల్పి రెడ్డిదే. పోస్ట్ బారియాట్రిక్ గర్భాలను నిర్వహించడం, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్, సంతానోత్పత్తి పునరుద్ధరణ, సంక్లిష్టమైన స్త్రీ జననేంద్రియ ఆపరేషన్స్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు.
వృత్తి పట్ల నిబద్దత, అంకిత భావంతో ఆమె మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. మహిళలు, గర్భిణీలు మరింత బలంగా తయారు అయ్యేలా పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. అంతే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే ఆహారాన్ని పాటించాలి, తదితర వాటిని తెలియ పరుస్తున్నారు. ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యేలా మహిళలను చైతన్యవంతం చేస్తున్నారు డాక్టర్ శిల్పి రెడ్డి. గర్భిణీ స్త్రీలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఉండేలా పాటు పడుతున్నారు. మిసెస్ మామ్ పేరుతో గర్భీణీలకు పోటీ పెడుతూ వారికి గిఫ్ట్స్ తో పాటు విజేతలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందేలా చేస్తున్నారు. ఇలాంటి ఐడియాను అన్ని ఆస్పత్రుల్లో అమలు చేస్తే ఎందరికో మేలు జరుగుతుంది కదూ.
No comment allowed please