Draupadi Murmu : ద్రౌపది ముర్ము తెలంగాణ టూర్ రద్దు
అర్దాంతరంగా విరమించుకున్న వైనం
Draupadi Murmu : భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపది ముర్ము(Draupadi Murmu) తెలంగాణ లో పర్యటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనకు ఓటు వేయమంటూ ఆమె పలు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు.
ఈనెల 18న అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా అపారమైన అనుభవం కలిగిన, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాను నిలిపాయి.
వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. ప్రతిపక్షాలు ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయ్యాయి. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము అధికారికంగా మంగళవారం ఈనెల 12న పర్యటించాల్సి ఉంది తెలంగాణలో.
కానీ అర్ధాంతరంగా ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ముది స్వస్థలం ఒడిశా. అత్యంత పేద కుటుంబం నుంచి పైకి వచ్చారు.
ఆదివాసీ గిరజన తెగకు చెందిన వారు. మొదట జూనియర్ అసిస్టెంట్ గా జీవితం ప్రారంభించారు. కౌన్సిలర్ గా గెలుపొందారు. భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించారు.
జాతీయ స్థాయి నాయకురాలిగా పని చేశారు. అనంతరం ఒడిశా ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ కొలువు తీరాక జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా పని చేశారు.
ప్రస్తుతం రాష్ట్రపతి బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా ఈనెల 21న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
Also Read : కేసీఆర్ పై పోటీకి సిద్ధం ఓటమి ఖాయం