CJI Chandrachud : డ్రెస్ కోడ్ అత్యంత ముఖ్యం – సీజేఐ
స్పష్టం చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 50వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనదైన ముద్ర కనబరుస్తున్నారు. ఇప్పటికే కీలకమైన తీర్పులకు పేరొందారు జస్టిస్ చంద్రచూడ్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యాయవాదులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అంతే కాదు ఇక నుంచి దేశ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరో వైపు ఇవాళ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ రచయిత, ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ఆనంద్ కు బెయిల్ ఇవ్వడంలో. ఎన్ఐఏ బెయిల్ వద్దంటూ జారీ చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా మరో కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud). శీతాకాల సెలవులకు ముందే కోర్టులో పెండింగ్ లో ఉన్న బదిలీ పిటిషన్ లను పరిష్కరించాలని సూచించారు.
ఇదిలా ఉండగా మహిళా న్యాయవాదుల విషయంలో డ్రెస్ కోడ్ విషయంలో మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు సీజేఐ. కోర్టులో దాదాపు 3 వేల బదిలీ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్లను కూడా వేగవంతం చేయాలని అన్నారు.
ప్రస్తుతం తమకు 13 బెంచ్ లు ఉన్నాయని ప్రతి రోజూ 130 బదిలీ పిటిషన్లను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు సీజేఐ డీవై చంద్రచూడ్.
జిల్లా న్యాయవ్యవస్త ఎలా పని చేస్తుందనే దానిపై రాజ్యాంగం పని ఆధారపడి ఉందన్నారు సీజేఐ.
Also Read : రిపబ్లిక్ డేకు అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్