TS Farmers Drones : అన్నదాతలకు సబ్సిడీపై డ్రోన్లు
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
TS Farmers Drones : టెక్నాలజీ మారుతోంది. ప్రతి రంగంలో సాంకేతిక ప్రధానంగా మారింది. ఇక వ్యవసాయ రంగం కూడా ఇందుకు మినహాయింపు ఏమీ ఉండడం లేదు.
ఆధునిక పద్దతుల్లో సాగు చేయడం అన్నది గత కొంత కాలం నుండి ప్రారంభమైంది. ఎరువులు, రసాయనాలు లేని ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభమైంది. ఈ రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానంగా దేశ వ్యాప్తంగా సుభాష్ పాలేకర్ తీసుకు వచ్చిన ప్రకృతి వ్యవసాయం మరింతగా రైతులకు చేరువయ్యేలా చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సాగు రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇప్పటికే ఐటీ హబ్ , వీ హబ్ , అగ్రి హబ్ ను ఏర్పాటు చేసింది. సాగు రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చే ఆలోచనలతో కూడిన అంకురాలకు ఆలంబనగా ఇస్తోంది.
రాను రాను లేబర్ కాస్ట్ ఎక్కువ కావడంతో ఇప్పుడు సాగు రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యాంత్రీకరణకు ప్రయారిటీ ఇస్తోంది.
అంటే కూలీల అవసరం లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రతి చోటా డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు సాగు రంగంలోకి తీసుకు రావాలని యోచిస్తోంది సర్కార్.
వీటిని రైతులకు ఉపయోగం కలిగించేలా సబ్సిడీపై డ్రోన్లు(TS Farmers Drones) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో డ్రోన్ ధర రూ. 10 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా.
పేద, మధ్య తరగతి రైతులు వీటిని కొనుగోలు చేయలేరు. రైతు సంఘాలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. తొలుత మండలానికి ఒక్కటి చొప్పున ఆ తర్వాత గ్రామాలకు, అవసరమైన వారికి ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read : ప్యాకింగ్ ఫుడ్స్ పై జీఎస్టీ అవసరం – నిర్మలా