Dubai Weather : ఎప్పుడు ఎండలతో మండిపోయే దుబాయ్ లో ఇప్పుడు మంచు
ఇకసోమవారం అల్ జఫాలోని పర్వత ప్రాంతమంతా ముంచు దుప్పటి పరిచినట్లుగా మంచు కురిసింది...
Dubai : దుబాయ్ అంటే.. మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఎడారి. ఎడారి ప్రాంతమని. ఆ దేశంలో మంచు పడదు. వర్షాలు సైతం కురవవు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా దేశంలో పలు వాతావరణ మార్పులు సంభవించాయి. దీంతో దుబాయ్(Dubai)లోని కొన్ని ప్రాంతాల్లో తాజగా మంచు కురిసింది. దాంతో పర్వత ప్రాంతాలతోపాటు రహదారులు సైతం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. భారీగా మంచు కురుస్తుండడంతో.. రహదారులపై వాహనదారులు వైపర్స్ ఆన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. గత బుధవారం దేశంలోని ఉత్తర సరిహద్దులు.. రియాద్, మక్కాతోపాటు అల్ జాఫ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. ఇది అసిర్, తబుక్‌తోపాటు అల్ బహా ప్ర్రాంతాలను సైతం ప్రభావితం చేసింది. ఈ మేరకు స్థానిక వాచర్స్ డాట్ న్యూస్ వెల్లడించింది.
Dubai Weather Updates
ఇకసోమవారం అల్ జఫాలోని పర్వత ప్రాంతమంతా ముంచు దుప్పటి పరిచినట్లుగా మంచు కురిసింది. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో అందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. అవి వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఈ విధంగా మంచు కురువడం ఇదే తొలిసారి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు. అంతేకాదు.. భారీగా మంచు కురిసిందని తెలిపారు. ఈ సందర్బంగా ఆకాశంలో మెరిసిన ఇంద్రదనుస్సును సైతం నెటిజన్ కమ్రాన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలోని ఎడారిలో భారీ వర్షాల అనంతరం మంచు దుప్పటి సైతం పరుచుకుందని వివరించారు. ఇక యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్(Dubai)లో వాతావరణం మారుతుందని స్పష్టం చేశారు.
ఎడారిప్రాంతమైన దుబాయ్(Dubai)లో భారీ వర్షాలు, మంచు కురువడంపై యూఏఈ లోని జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. ఈ అసాధారణ వాతావరణానికి గల కారణం.. అరేబియా సముద్రం నుంచి ఒమన్ వరకు అల్పపీడనం వ్యాపించి ఉండటమేనని స్పష్టం చేసింది. ఆ కారణంతోనే వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వివరించింది. దీంతో సౌదీ అరేబియాతోపాటు ఆ దేశానికి పొరుగునున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంతా ఈ తరహా వాతావరణం నెలకొందని పేర్కొంది. అయితే రానున్న రోజుల్లో అల్ జఫ్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు ఖలేజా టైమ్స్ వివరించింది. అలాగే భారీ వర్షాలు, వడగళ్లు వానలు కురుస్తాయంది. ఇక తుపాన్‌తోపాటు భారీగా గాలులు సైతం వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే జాగ్రత్తలు సైతం పాటించాలని హెచ్చరించింది.
Also Read : Ex Minister Roja : ఏపీ డిప్యూటీ సీఎం పై భగ్గుమన్న మాజీ మంత్రి రోజా