Kandula Durgesh: పర్యటక రంగం అభివృద్ధికి ప్రణాళికను సిద్దమైంది: మంత్రి కందుల దుర్గేశ్
పర్యటక రంగం అభివృద్ధికి ప్రణాళికను సిద్దమైంది: మంత్రి కందుల దుర్గేశ్
Kandula Durgesh: గడచిన ఐదు సంవత్సరాలు పర్యటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి దుర్గేశ్ విరుచుకుపడ్డారు. ఈ రంగానికి రెండేళ్లలో పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. 27న ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 38 విభాగాల్లో అవార్డులు కూడా ఇవ్వబోతున్నామన్నారు. పర్యటక రంగం అభివృద్ధికి ప్రణాళికను తయారుచేసినట్లు పేర్కొన్నారు. బీచ్ రిసార్ట్స్, ఫెస్టివల్ రిసార్ట్స్, నగరవనాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Kandula Durgesh – మాజీ మంత్రి సోమిరెడ్డి..
సర్వేపల్లి కోడూరులోని బీచ్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి దుర్గేశ్‌ను కోరామన్నారు. గత ఐదేళ్లుగా పర్యటక ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తులు సర్వనాశనం చేశారని విమర్శించారు. జిల్లాకు మంజూరైన 6 నగర వనాల అభివృద్ధి కోసం మంత్రికి ప్రతిపాదించినట్లు చెప్పారు. కాకుటూరు నగరవనాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత తనదేనని తెలిపారు.
Also Read : Madhavilatha : శ్రీవారికి లడ్డు కల్తీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవీలత