Dwarampudi Chandrasekhar Reddy: సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు – ద్వారంపూడి

సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు - ద్వారంపూడి

Dwarampudi Chandrasekhar Reddy : హరిహార వీరమల్లు సినిమాకు కొద్ది రోజుల ముందు థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, హరిహార వీరమల్లు సినిమా కథానాయకుడు… టాలీవుడ్ పై తీవ్ర అసహానం వ్యక్తం చేస్తు లేఖను విడుదల చేసారు. గత ప్రభుత్వం సినీ పరిశ్రమను ఎన్నో అవమానాలకు గురిచేసినప్పటికీ… ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమకు అవసరమైన సహాయం చేస్తుంది. అయినప్పటికీ సినీ ప్రముఖులు ఇంతవరకు ప్రభుత్వ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై డిప్యూటీ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అయితే డిప్యూటీ సీఎం తీవ్ర అసహనానికి ముఖ్యకారణం… తన సినిమాకు పది రోజుల ముందు థియేటర్స్ బంద్ ప్రకటించడం. అయితే థియేటర్స్ బంద్ ప్రకటించడం వెనుక కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి హాస్తం ఉందంటూ ప్రముఖ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Dwarampudi Chandrasekhar Reddy Comments

ఈ నేపథ్యంలో నిర్మాత నట్టికుమార్ వ్యాఖ్యలపై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy) ఓ ప్రకటన విడుదల చేసారు. సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ చంద్రశేఖర్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు… ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం‌?’’ అంటూ చంద్రశేఖర్‌ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు

Leave A Reply

Your Email Id will not be published!