Dwayne Bravo : 600 వికెట్లతో డ్వేన్ బ్రేవో రికార్డ్
పొట్టి ఫార్మాట్ లో అరుదైన ఘనత
Dwayne Bravo : స్టార్ బౌలర్ గా పేరొందిన డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించాడు డ్వేన్ బ్రావో(Dwayne Bravo). పొట్టి ఫార్మాట్ టి20లో ఏకంగా 600 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా పొట్టి ఫార్మాట్ లో ఇన్ని వికెట్లు తీసిన మొట్ట మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
డ్వేన్ బ్రావో తన టి20 కెరీర్ లో 516 వ ఇన్నింగ్స్ ఈ ఫీట్ సాధించాడు. తొలి బౌలర్ గా ప్రపంచంలో తనదైన రికార్డ్ సాధిస్తూనే వెస్టిండీస్ తరపున ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్ గా కూడా మరో చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నమెంట్ లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో తార్తర్న్ సూపర్ చార్జర్స్ తరపున ఆడుతున్నాడు. డ్వేన్ డ్రేవో సామ్ కర్రాన్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ ఘనత సాధించాడు.
టి20 ఫార్మాట్ లో ఈ ఫీట్ సాధించడం మామూలు విషయం కాదు. మోస్ట్ పవర్ ఫుల్ బౌలర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటికే డ్రేవో. అంతే కాదు భారత్ లో ప్రతి ఏటా జరిగే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో కూడా ఆడుతున్నాడు బ్రేవో .
బంతుల్ని అత్యంత వేగవంతంగా మల్చడంలో, బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడంలో తనకు తానే సాటిగా ప్రూవ్ చేసుకున్నాడు బ్రేవో. ఇక టి20లో 600వ వికెట్ ను సాధించిన వెంటనే ఎప్పటి లాగా సంతోషం పట్టలేక పోయాడు. సంబురాలు చేసుకున్నాడు.
తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 20 బంతులలో 29 పరుగులు ఇచ్చి డ్వేన్ బ్రేవో 2 వికెట్లు తీశాడు.
Also Read : సత్తా చాటుతాం భారత్ ను ఓడిస్తాం