Earthquake: ఢిల్లీలో స్వల్ప భూకంపం

ఢిల్లీలో స్వల్ప భూకంపం

Earthquake : దేశ రాజధానిలో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి.

Earthquake in in Delhi

ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్‌ లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్‌. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్‌ కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్‌–డెహ్రాడూన్‌ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్‌లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది.

Also Read : CM Devendra Fadnavis: రాహుల్‌ ‘ఫిక్సింగ్‌’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్‌ కౌంటర్‌ ఆర్టికల్‌

Leave A Reply

Your Email Id will not be published!