Eatala Rajender : భాగ్యనగరం సంస్కృతికి దర్పణం
మాజీ మంత్రి ఈటల రాజేందర్
Eatala Rajender : హైదరాబాద్ – దేశంలోనే భాగ్యనగర సంస్కృతి అత్యంత గొప్పదని కితాబు ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల ప్రసంగించారు.
హైదరాబాద్ లో ఏకంగా 50 లక్షల గణనాథులను ఏర్పాటు చేశారని ఇది దేశ చరిత్రలో అత్యధికమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈటల రాజేందర్. ఆయనతో పాటు కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్ పాల్గొన్నారు.
Eatala Rajender Comment
ప్రజల విశ్వాసాన్ని, పండుగలను , నమ్మకాలను సమున్నతంగా నిలిపిన సంస్థ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అని పేర్కొన్నారు ఈటల రాజేందర్(Eatala Rajender). అత్యంత ప్రశాంతంగా నిమజ్జనం జరగడం ప్రజల సంస్కృతికి, అనుబంధానికి దర్పణంగా నిలిచిందన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే కాలంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకు పోవడంలో ఉత్సవ సమితి మరింత గొప్ప పాత్ర పోషిస్తుందని, ఈ నమ్మకం తనకు ఉందన్నారు ఈటల రాజేందర్.
Also Read : Vijayashanthi : శాపంగా మారిన కేసీఆర్ పాలన