Model Code of Conduct(MCC): ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ తొలి వేటు !
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ తొలి వేటు !
Model Code of Conduct(MCC): లోక్ సభ ఎన్నికల నగారా మ్రోగడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. శనివారం సాయంత్రం చీఫ్ ఎలక్షన్ కమీషన్ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నిలక షెడ్యూల్ ను విడుదల చేసింది. అనంతరం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోనికి వస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించి… విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న రాజకీయ నాయకులు, అధికారులను డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నారు.
Model Code of Conduct (MCC)Updates
ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ(EC) తొలి వేటు వేసింది. అధికార వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమిలి వీఆర్వోను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపించి… వీఆర్వో రమేష్ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read : PM Narendra Modi: జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు !