EC Notice : కేటీఆర్ కు షాక్ ఈసీ నోటీస్
నిరుద్యోగులతో సమావేశంపై ఫైర్
EC Notice : హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. తన తండ్రి సీఎం కేసీఆర్ కు సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, నోరు పారేసు కోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. తాజాగా తనయుడు కేటీఆర్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.
EC Notice to KTR
టీ హబ్ లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఖాళీల భర్తికి చర్యలు తీసుకుంటానని, బోర్డును మారుస్తామని, కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు.
ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనంటూ పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు సీఈసీకి(EC) ఫిర్యాదు చేశారు. మరో వైపు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏకే గోయల్ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు దాచారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇదే సమయంలో కేటీఆర్ కు షాక్ ఇస్తూ ఈసీ నోటీసులు జారీ చేయడం కలకం రేపింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Also Read : Rythu Bandhu : 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు