IPS Transfers: ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు !

ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు !

IPS Transfers: ఏపీ మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుతో పాటు విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోగా వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ ను పంపాలని సూచించింది. సదరు అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్పష్టం చేసింది. విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.

IPS Transfers Transfters Viral

ఏపీలో పలువురు ఐపీఎస్‌(IAS) అధికారుల వ్యవహారశైలిపై ఇటీవల బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మరి కొందరు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘ ప్రధాని మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫ్యల్యాలతో పాటు, ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్‌ డీజీ ఇబ్బంది పెట్టారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇంటెలిజెన్స్‌ డీజీగా కొనసాగుతున్న అపరిమిత అధికారాలు ఉపయోగించుకుని విపక్ష నేతలను వేధిస్తున్నారంటూ కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేసారు. విజయవాడ సీపీ కాంతిరాణా… వైసీపీతో అంటకాగుతూ చిన్నా చితకా కారణాలకు కూడా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలమేరకే సీపీ నడుచుకుంటున్నారు’’ అని పురందేశ్వరి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల సీఎంపై జరిగిన రాయిదాడి ఘటనకు సంబంధించి కూడా కాంతిరాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గులకరాయ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం ప్రయాణిస్తున్న ప్రాంతంలో కరెంటు లేకపోవడం ఏంటని ప్రశ్నించింది. అయినా సీఎంను బస్సుపైన నిలబెట్టి ఎన్నికల ప్రచారం చేయించడంపై ఏపీ పోలీసు అధికారులపై సీరియస్ అయింది. సీఎంపై దాడి ఘటన తదనంతర పరిణామాలపైన సీపీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సీఈవో మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Ambati Murali Krishna: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్ ? ఈసీ కీలక ఆదేశాలు !

Leave A Reply

Your Email Id will not be published!