Farooq Abdullah: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ కేసు కొట్టివేత !
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ కేసు కొట్టివేత !
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలను జమ్మూకశ్మీర్ హైకోర్టు కొట్టివేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘంలో అక్రమాలు జరిగాయని సీబీఐ నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా ఈడీ ఈ అభియోగాలను మోపింది. అయితే సంబంధిత సెక్షన్లు మనీలాండరింగ్ చట్టం ప్రకారం నేరాలు కావని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో అబ్దుల్లాతో పాటు క్రికెట్ సంఘంలో వివిధ పదవులు చేపట్టిన వారిని ఈడీ నిందితులుగా చేర్చింది.
Farooq Abdullah Case
జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో జరిగిన అవకతవకలపై ఫరూక్ అబ్దుల్లా ప్రమేయంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా… సీబీఐ 2018 లో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం… ఫరూక్ అబ్దుల్లాపై పలు మనీ లాండరింగ్ ఆరోపణలపై 2022లొ ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సంబంధం లేని పార్టీలు, JKCA ఆఫీస్ బేరర్లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం, అలాగే JKCA బ్యాంక్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణలు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన జమ్మూ కాశ్మీర్ హై కోర్టు ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : WHO : ఆ వ్యాధి కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ