MLC Kavitha Buchibabu : ఎమ్మెల్సీ క‌విత..బుచ్చిబాబుపై ఫోక‌స్

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ జ‌రిగేనా

Buchibabu MLC Kavitha : ఎవ‌రీ గోరంట్ల బుచ్చిబాబు అనుకుంటున్నారా. ప‌లు కంపెనీలు, ప్ర‌ముఖుల‌తో పాటు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఆడిట‌ర్ గా ఉన్నారు(Buchibabu MLC Kavitha). ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఇత‌డి పాత్ర ముఖ్య‌మ‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక కోర్టులో స‌మ‌ర్పించిన ఛార్జ్ షీట్ లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది. ఆడిట‌ర్ బుచ్చిబాబును ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో వ్యాపార‌వేత్త అరుణ్ రామ‌చంద్ర‌న్ పిళ్లైని క‌స్ట‌డీకి తీసుకుంది.

ఇందులో భాగంగా మైనంపాటి శ్రీ‌నివాస‌రావు, బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావు తో పాటు ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబు , ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి త‌న‌యుడు, విజ‌య్ నాయ‌ర్ , స‌మీర్ మ‌హీంద్రు , మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ గా ఏర్పాటై ఢిల్లీ లిక్క‌ర్ దందా న‌డిపించార‌ని, రూ. 100 కోట్లు చేతులు మార్చార‌ని, హ‌వాలా చోటు చేసుకుంద‌ని, దీని వెనుక ఆడిట‌ర్ బుచ్చిబాబు స్కెచ్ వేశాడ‌ని ఈడీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో క‌ల్వ‌కుంట్ల క‌విత(MLC Kavitha) కీల‌క పాత్ర పోషించడమే కాకుండా లిక్క‌ర్ డాన్ గా మారింద‌ని పేర్కొంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి 34 మందిపై అభియోగం మోపింది సీబీఐ. 11 మందిని అరెస్ట్ చేసింది ఈడీ. అంద‌రూ ప్ర‌స్తుతం తీహార్ జైలులో సేద దీరుతున్నారు. తాజాగా మార్చి 11న ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసుకు సంబంధించి 9 గంట‌ల పాటు విచార‌ణ చేప‌ట్టింది. మార్చి 16న రావాల‌ని నోటీస్ ఇచ్చింది. కానీ ఆరోజు రాలేదు. సుప్రీంను ఆశ్ర‌యించినా ప‌ట్టించు కోలేదు.

Also Read : పిళ్లై..ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ జ‌రిగేనా

Leave A Reply

Your Email Id will not be published!